29 August, 2026 | 12:40 PM

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం   •   ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •  

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల సాకారం

16-04-2026 12:00 AM

మొయినాబాద్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): మొయినాబాద్ మండలం ఎలుకగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని అన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ పేదల ఆశలను నెరవేర్చుతున్నారని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు గృహ వసతి కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్ప కార్యక్రమమని, పేదల కోసం తీసుకున్న నిర్ణయాలు వారికి ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఎండి మినాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీటీసీ కేబుల్ రాజు, చిలుకూరు రాజు, కుమార్ యాదవ్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు గుడిపల్లి ప్రభాకర్, శ్రీకాంత్, తోలకట్ట యాదయ్య, ఆలూరి ప్రభు, గుడిపల్లి ప్రసాద్, మహేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.