17 April, 2026 | 7:24 PM

సమన్వయంతోనే గాడిలోకి ఆర్థిక వ్యవస్థ

13-05-2025 12:00 AM

గాడి తప్పిన వ్యవస్థలను చక్క దిద్దాల్సిన కుటుంబ యజమాని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా, అనవసర వ్యాఖ్యలు చేసినా యావత్ కుటుంబంపై ఆ ప్రభావం ఉంటుంది. కుటుంబ సభ్యులు  బెంబేలెత్తిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా కుటుంబ యజమాని కుటుంబ సభ్యులను సమన్వయం చేసుకుంటూ తగిన వ్యూహాలు అమలు చేస్తూ ముం దుకు వెళితే వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం ఉంటుంది. 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధార పడి ఉంది. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణలో సాగుకు ప్రధాన ఆధారం. ఇక్కడి రైతులు ప్రధానంగా వరి సాగు చేస్తారు. ఆ తర్వాత పత్తి, మిర్చి, చెరకు, మామిడి , పొగాకు పంటలకు ప్రాధాన్యమిస్తారు. కొన్నిచోట్ల రైతులు పొద్దుతి రుగుడు , వేరుశనగ వంటి పంటలు కూడా పండిస్తున్నారు.

కృష్ణా పరిధిలోని నాగార్జున సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్ట్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తున రాతి కట్టడాల్లో ఒకటి. వ్యవసాయం తర్వాత రాష్ట్రం ఆర్థికంగా సమాచార సాంకేతికత , బయోటెక్నాలజీ రంగాలపైనా ఆధారపడి ఉంది.  భారత్‌లోని అగ్రశ్రేణి ఐటీ -ఎగుమ తి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి. తెలంగాణ ఖనిజ సంపన్నమైన రాష్ట్రం.

ఇక్కడి సింగరేణి కాలరీస్ లిమెటెడ్ పరిధిలో లక్షలాది టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. గడిచిన ఐదేండ్లలో సగటు వార్షిక వృద్ధి రేటు 13.90% కలిగి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 2023- -24 సంవత్సరానికి తెలంగాణ నామమాత్రపు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి రూ.15.2 లక్షల కోట్లు (180 బిలియన్ డాలర్లు). 2018- -19 నుంచి  రాష్ట్ర ఆర్థిక రంగంలో సేవా రంగం దాదాపు 65% వాటాను కలిగి ఉంది.

ఉత్పతి, ఎగుమతుల పరంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేశంలో తొమ్మిదో అతిపెద్దది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) 18 ట్రిలియన్ డాలర్లు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తలసరి జీఎస్డీపీ 4,600 డాలర్లు. 2024లో మానవ అభివృద్ధి సూచికపై  తెలంగాణ 0.740 పాయింట్లు నమోదు చేసింది. రాష్ట్ర జీడీపీలో దాదాపు 54% హైదరాబాద్ మహానగరం నుంచే వస్తుంది. 

దీర్ఘకాలిక ప్రణాళికలతోనే..

కుటుంబం లేదా ఒక  రాష్ట్రం లేదా ఒక దేశం..  వ్యవస్థ ఏదైనా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఆ చక్కబెట్టుకోవడం సమన్వయంతో జరిగితేనే బాగుంటుంది. సమస్యలను పరిష్కరించాల్సిన వారు ఆందోళన గురైతే, యావత్ వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. ఆ పరిస్థితి మానసిక, ఆర్థిక, సామాజిక సంక్షోభాలకు దారి తీస్తుంది.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవడం ఒకే ఒకరోజులో ఒక మంత్రదండం పట్టుకుని చేసే పనికాదు. దీర్ఘకాలికంగా వ్యూహాలు, ఎత్తుగడలు, పని విభజన, సంపద సృష్టి, ఆర్థిక వేత్తల సలహాలు, సూచనలు పాటించి ఆర్థిక వ్యవ స్థను బలోపేతం చేయవచ్చు. గాడి తప్పిన వ్యవస్థలను చక్క దిద్దాల్సిన కుటుంబ యజమాని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా, అనవసర వ్యాఖ్యలు చేసినా యావత్ కుటుంబంపై ఆ ప్రభావం ఉంటుంది.

కుటుంబ సభ్యులు  బెంబేలెత్తిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా కుటుంబ యజమాని కుటుంబ సభ్యులను సమన్వయం చేసుకుంటూ తగిన వ్యూహాలు అమలు చేస్తూ ముం దుకు వెళితే వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం ఉంటుంది. ఒక  కుటుంబానికైనా, వ్యవస్థకైనా, రాష్ట్రానికైనా, కేంద్ర ప్రభుత్వానికైనా ఇదే నియమం వర్తిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వాలన్నీ లోటు బడ్జెట్ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాలను ఆదరువుగా చేసుకుని ప్ర భుత్వాలు పాలన సాగిస్తున్నాయి. అప్పులు తెచ్చి, దీర్ఘకాలిక ప్రణాళికలతో వాటిని నెల నెలా ఈఎంఐల రూపంలో మిత్తి, అసలు చెల్లించడం రాష్ట్రప్రభుత్వాలకు సర్వసాధారణమైంది. ఈ పద్ధతిలోనే కొన్ని రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతున్నాయి.

అలాంటప్పుడు తెలంగాణకు మా త్రం అందుకు మినహాయింపు ఎలా ఉం టుంది? సీఎం రేవంత్‌రెడ్డి కేవలం ఉద్యోగులపైన అక్కసు వెళ్లగక్కి, ఉద్యోగులపై నింద మోపడం సమంజసంగా లేదు.  ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే విశ్లేషకులు, ఉద్యోగ సంఘాల నేతలు  అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేతులెత్తేసినట్లు మాట్లాడడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ‘సంపద సృష్టిస్తాం.. ఆ సంపదను ప్రజలకు పంచు తాం’ అనే మాటను తరచుగా వాడుతున్నది. సంపదను సృష్టించగలిగే వ్యూహా లకు ప్రణాళికలు రచించడం ప్రభుత్వ విధి. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగుల జీత భత్యాలకు పెద్ద మొత్తంలో రాష్ట్ర ఆదాయం వెళుతుందని ముఖ్యమంత్రి ఇటీవల అన్నారు.

ఆదాయం కంటే ప్రతినెలా ఖర్చు ఎక్కువగా ఉంటుందని,  గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్లిందని, అలాగే ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాల్సి ఉందని, లోటు బడ్జెట్ కారణంగా వాటిని కూడా అమలు చేయలేకపోతున్నామని తెలిపారు. ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఎక్కడిది? అని సీఎం ప్రకటించడం సమంజసం కాదు. 

దుబారా మంచిది కాదు..

పాలకులు, ప్రజాప్రతినిధులు అక్రమార్జనకు పాల్పడడం,  దుబారా చేయడం, పొదుపును పాటించకపోవడంతో ప్రభు త్వ ఖర్చు పెరుగుతూ వస్తున్నది. ఈ విషయాన్ని  ప్రభుత్వాలు అంగీకరించి తీరాలి. శాసనసభ్యులు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు దక్కిం చుకున్న ప్రతినిధుల ఖర్చు సైతం మించిపోతున్నది. భద్రత పేరుతో, కాన్వాయ్‌ల పేరుతో నెలనెలా రూ.లక్షల ప్రజాధనం ఖర్చవుతున్నది.

అలాగే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రయాణాల గు రించి కూడా ప్రస్తావించారు. తాను ప్రత్యేక టిక్కెట్ వేసుకుని ఫ్లుట్లైలో తిరగవచ్చని, కానీ..తాను సాధారణ టిక్కెట్ తీసుకుని ప్రయాణిస్తున్నానని వెల్లడించారు. ఆచరణాత్మకంగా పొదుపు మార్గాలు పాటించ డం మంచిదే.  స్వీయ నియంత్రణ పాటించడమూ స్వాగతనీయం.

సీఎం అలాగే ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన అసవరం ఉంది. ఇదే సమయంలో ఉద్యోగులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలను ప క్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉం ది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే రీతిలో కాకుండా, సామరస్యపూర్వకంగా సాధించుకుంటే మంచిది.

మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారి స్తూనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంచ డం కూడా ముఖ్యమే. పంటలు పండనటువంటి భూములకు కూడా ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అలాంటి దుబారా ఖర్చు లను  తగ్గించుకుంటే, మరింత మంది పేదలకు సాయం చేసే అవకాశం ఉంది.

‘ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి’ అనే నినాదంతో పాలకులు, ఉద్యోగులు పనిచేయాలి. విద్యా, వైద్య రంగాలతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా సంపదను సృష్టించవచ్చు. అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెంకించవచ్చు. ఆ మార్గాలకు తిలోదకాలు  ఇచ్చిన ఏ ప్రభుత్వమూ నిలబడ్డ దాఖలాలు గతంలో లేవు. 

డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి