17 April, 2026 | 6:04 PM

శాంతి రాగం ఎలా ఉండాలంటే ?

14-05-2025 12:00 AM

ఏదో మత ఛాందసం 

శాంతిరెక్కలను తెగనరికింది

రెక్కలు చిమ్మిన నెత్తురు 

దాయాదుల నేలపై నిప్పులు కురిపించింది

ముష్కరుల గుండెల్లో వణుకు పుట్టించింది

ఉగ్రవాదం ధ్వంసరచన చేస్తుంటే

శాంతిపాట నిద్రపుచ్చే జోలపాట కాకూడదు

శాంతిమంత్రం తెగిన రెక్కలను ముడేసినంత మాత్రాన 

సలపర గాయాల నుంచి కారే రసి ఆగదు

గొంతులు కోసి ‘క్షమించండి..’ అంటే సరిపోదు

శాంతి కపోతపు గాయం తిరగదోడని 

రాగాల కృతులు కూర్చాలిప్పుడు

బృంద గానమై శాంతి స్వరాలను ఆలపించాలిప్పుడు !

 యాదయ్య కొప్పోలు