29 April, 2026 | 3:25 AM

కంచె లేదాయే.. రక్షణ కరువాయే!?

29-04-2026 12:31 AM

నూతన ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టిన కంచ వేస్తే ఒట్టు 

చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ 

యధావిధిగా బిల్లులు.. అదుపు తప్పితే అంతే..

ట్రాన్స్‌ఫార్మర్లకు కంచె వేసేది ఎవరు?

మహమ్మదాబాద్, ఏప్రిల్ 28: విద్యుత్ శాఖ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు ప్రమాదబరిత శాఖలో ఉద్యోగం చేస్తున్నామని చూపిస్తూ అత్యధిక జీతభత్యాలు సైతం ప్రభుత్వం అందజేస్తుంది. ప్రమాద శాఖలో మరింత ప్రమాదంగా పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు అధికంగా ఇవ్వడం మంచి విషయమే. ఇక్కడి వరకు బాగానే ఉన్నా విద్యుత్ శాఖ పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

పాత ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు అటు ఉంచితే నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కవచం కంచ ఏర్పాటు చేయడంలో సంబంధిత కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండ్రు. గత కొన్ని నెలల క్రితం జడ్చర్లలో  ఓ విద్యార్థి ఆడుకుంటూ ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృత్యువాత పడ్డారు. ఇటీవల మహమ్మదాబాద్ మండలం పరిధిలో అన్నారెడ్డిపల్లి గేటు దగ్గర ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ను తాకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. కొన్ని ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్న మరికొన్ని ప్రమాదాలు చేతికి అందే దూరం ఉండడంతో క్షణికావేశంలో కొందరు ప్రాణాలు వదులుకుంటున్నారు.

నియంత్రించాల్సిన అధికారులు మాత్రం అటువైపు ఆలోచన చేయడమే మానేసిన్రు. పాత ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఎప్పుడో కంచ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ కంచెలు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ లేవని అనుకోవడానికి లేదు. ఇటీవల ఏర్పాటు చేస్తున్న నూతన ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అవేమి తమ పనులు కావనట్టు పర్యవేక్షణకు మాకు సంబంధమే లేనట్టు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణతో జనం నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. 

మనుషులతో పాటు పశువుల ప్రాణాలు సైతం....

ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు లేకపోవడంతో ప్రమాదవశాత్తు మనుషుల ప్రాణాలు పోవడంతో పాటు పశువుల ప్రాణాలు సైతం పోయిన దాఖలాలు లేకపోలేదు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆ పనే తమది కారునట్టు వ్యవహరించడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. పర్యవేక్షణ లోపం విద్యుత్ శాఖలో తీవ్రంగా ఉందని ప్రజలే ప్రత్యేకంగా చెబుతున్న మాట. ప్రాణం పోయిన తర్వాత పరిహారం అందిస్తాం అని చెప్పే బదులు ఆ ప్రాణానికి ప్రమాదంగా మారుతున్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదని సంబంధిత కాంట్రాక్టర్లను అధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కాని విషయంగా జనం మదిలో మెదులుతుంది. 

పర్యవేక్షణ ఎక్కడ.. ఫలితం శూన్యం..

ఒప్పందలు చేసుకుని సంబంధిత కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు ఆ పనులు ఏమాత్రం జరుగుతున్నాయో పర్యవేక్షణ మాత్రం అంతంతే దర్శనమిస్తుంది. కంచలు ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ ప్రాధేయపడుతున్న అధికారులు ఎక్కడ ఒకచోట చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇక మా పని అయిపోయింది అన్నట్టు వ్యవహరించడం జనానికి ఆగ్రహానికి గురిచేస్తుంది.

ప్రతి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచ ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్న ఆ నిబంధనలు మావి కావనట్టు, ప్రమాదాలకు ట్రాన్స్ఫార్మర్లు నిలయంగా మారడం విశేషం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రతి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచ ఏర్పాటు చేసి, చేయని కాంట్రాక్టర్ల బిల్లు లను నిలుపుదల చేసి పనులను సమర్ధవంతంగా చేయించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెబుతున్న మాట. ఈ విషయం పై మహమ్మాదాబాద్ విద్యుత్ శాఖ మండల ఎఈ శ్రీవిద్యా ఫోన్  ద్వారా సమాచారం అడిగేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.