28 July, 2026 | 12:56 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్యాల మాజీ ఎంపీటీసీ కొల్లూరి గంగాధర్

28-07-2026 12:11 AM

మల్యాల జులై 27 (విజయక్రాంతి): మల్యాల మండలం పోతారం తాజా మాజీ ఎంపిటిసి కొల్లూరి గంగాధర్ బిజెపి పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. గంగాధర మండల కేంద్రంలోని ప్రజా కార్యాలయంలో చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కొల్లూరి గంగాధర్ తో పాటు సుమారు 300 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు బిజెపి వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కొల్లూరి గంగాధర్ మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేస్తున్న అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రగతి మేడిపల్లి సత్యం నాయకత్వంలోనే సాధ్యమవు తుందని నమ్మి, ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వ పాలన, నియోజకవర్గ అభివృద్ధి పనులను చూసి స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రతి ఒక్కరికీ పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, జగిత్యాల జిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నక్క అనిల్ నూకపల్లి రాంపూర్ గుడిపేట మనాల సర్వపూర్ సర్పంచులు, మిల్ట్రీ శ్రీను, బద్దం తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి, జంగిలి హన్మంత్, పాపారావు, సీనియర్ నాయకులు దొంగ ఆనందరెడ్డి, మ్యాక లక్ష్మణ్, ఉపసర్పంచ్ కటకం వినయ్ వెల్మ కృష్ణారెడ్డి, శనిగరపు తిరుపతి నేరెళ్ల సతీష్ రెడ్డి,బండి రవి, బివి రమణ, నర్సిమహా రెడ్డి కంటే అరుణ్ తదితరులు పాల్గొన్నారు.