9 April, 2026 | 11:05 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ముదురుతున్న డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అంశం

17-04-2025 02:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎస్జీటీ టీచర్ నియామక వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.  మొత్తంగా ఈ వ్యవహారం లోకాయుక్తకు చేరిం ది. అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరు తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త జోరు తిరుపతి బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుదారుడు సమర్పించిన కొన్ని ఆధారాలను పరిశీలించిన లోకా యుక్త ఈ వ్యవ హారంపై విచారణకు అనుమతించింది. ఈ విషయంపై స్పోర్ట్స్ అథారిటీ సమర్పించిన నివేదికనే విద్యాశాఖ మరోసారి తిప్పిపంపింది.  డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 95 పోస్టులుండగా, ఆ క్యాటగిరీలో 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ క్యాటగిరీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాధ్యతలను ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి అప్పట్లో అప్పగించింది.

ఇందులో భాగంగానే 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి 95 పోస్టులకుగానూ 33 మందికి అప్పట్లో ఉద్యోగాలిచ్చారు. మిగిలిన 62 పోస్టులను ఓపెన్ కోటాకు మళ్లిం చారు. కానీ పోస్టులివ్వడంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించడంతో తొలుత కిందిస్థాయి అధికారులు అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలిం చారు. జనవరి 3, 4న ఉన్నతాధికారులు మళ్లీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారు. మూడుసార్లు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినా ఒక్క నివేదికనూ బయటపెట్టలేదు.