11 August, 2026 | 12:33 PM

Breaking News

అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •   కొలంబియాలో భారీ భూకంపం   •   శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా వెండి కాయిన్స్ స్వాధీనం   •  

గోదావరి నదిలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం

06-11-2024 01:00 PM

భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన నిజామాబాద్ వాసి, భార్యాబిడ్డ క్షేమం

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నం

నిజామాబాద్ (విజయక్రాంతి): గోదావరి నదిలో నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా సంఘటన బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ న్యాల్కల్ రోడ్ లో నివాసం ఉంటున్న వేణు అనురాధ దంపతులు గత కొద్ది రోజులు క్రితం అవసరం నిమిత్తం వడ్డీ వ్యాపారుల నుంచి మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి అప్పును చెల్లించారు.

కానీ నగరానికి చెందిన వడ్డీ వ్యాపారులు వికాస్ రోషనులు అధిక వడ్డీ కోసం వేధించడంతో పాటు వేణు కుమార్తె పూర్ణిమను అమానుషంగా తిట్టడంతో కలత చెందిన ఆ కుటుంబం బాసర వెల్లి ఆత్మహత్యకు పాల్పడగా గోదావరి నదిలో ఉన్న జాలరులు వేణు భార్య అనురాధను కాపాడారు. వేణు అతని కూతురు పూర్ణిమ నదిలో గల్లంతయ్యారు వారి కోసం గాలిస్తున్నారు. బాసర పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలను సేకరించారు, ఇంకా వేణు పూర్ణిమలు లభించలేదు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.