రైతు గోస... బీజేపీ భరోసా
23-05-2026 12:00 AM
నిర్మల్ మే 22 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం పంట కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ బిజెపి పార్టీ రైతు గోస బీజేపీ భరోసా యాత్ర సోమవారం నుండి ప్రారంభిస్తున్న టు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ భరోసా యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. పంట కొనుగోల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.






