ఐఐఎంసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం
తిమ్మాయిపల్లి, ధర్మారం గ్రామాల్లో ఇంటింటి సర్వే
ఖైరతాబాద్ , మార్చి 17(విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ 1,2 యూనిట్ల ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్‌లో గల తిమ్మా యిపల్లి, ధర్మారం గ్రామాల్లో జాతీయ సేవా పథక ప్రత్యేక శిబిరం వారం రోజుల పాటు సోమవారం నుంచి ఈ నెల 22 వరకు ఏర్పా టు చేశారు.
మొదటిరోజు శిబిరం ప్రారంభోత్సవంలో భాగంగా తిమ్మాయిపల్లి గ్రామం లోని జనహిత సేవా సమితి ట్రస్టిలు నరసింహమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు సామా జిక సేవలో భాగం కావడం ఎంతో ఆనందం కలగజేస్తుందని, మీలాంటివారు ముందుకొస్తే సమాజంలో ఎంతో మార్పు తీసుకురావొచ్చ ని తెలిపారు. శ్రీదేవి మాట్లాడుతూ ప్రతిఒక్కరు సేవా దృక్పథంతో పనిచేయాలని తెలియజేశారు. యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ సత్యనా రాయణ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ముఖ్యోద్దేశ్యాన్ని తెలిజేశారు.
యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ ఇ.రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక శిబిరంలో తిమ్మాయిపల్లి, ధర్మారం గ్రామాల్లో చేయవలసిన కార్యక్రమాల గురిం చి వివరించారు. మొదటి రోజున ఉదయం సూర్యనమస్కారాలు, ధ్యానంతో ప్రారంభమైన ప్రత్యేక శిబిరంలోని రెండవ రోజు అధికారిక విద్య,సాధారణ ఉపాధిలో లేని యువత సర్వే కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు రెండు గ్రామాల్లో ఉన్న 300 కుటుంబాలను సర్వే చేసి వారి వివరాలను తెలుసుకున్నారు.ఉపాధి లేని వారికోసం ఉపాధి కల్పన అవకాశాలను గురించి వారికి తెలియజేశారు.
ఈ సర్వే భాగంగా ఎన్ ఎస్ ఎస్ విద్యార్థు లు గ్రామాల్లోని అనేక కుటుంబాలతో మాట్లాడటం ద్వారా ఎన్నో జీవన నైపుణ్యాలను పెంపొందించుకున్నామని తెలియజేశారు. మధ్యాహ్నం తిమ్మాయిపల్లి గ్రామ పరిధిలో జనహిత సేవా సంస్థ నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులతో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఇంటరాక్షన్ అయ్యి వారి తో కలిసి ఆటలు ఆడారు. మానసిక వికలాంగుల కోసం జనహిత సేవా సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు.




