26-11-2025 10:47:38 PM
హనుమకొండ (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ ఫెడరేషన్ ఆఫ్ ఒబేసిట్రిక్ అండ్ గైనకాలజికల్ సోషస్టిక్ ఆఫ్ ఇండియాతో కలిసి నిర్వహించిన తొలి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించింది. అడ్వాన్సింగ్ ఎక్సలెన్స్ ఇన్ అబ్స్ట్రాస్ట్రిక్, గైనకాలజి కేర్ అనే ప్రధాన అంశంతో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమం ఆరోగ్య నిపుణుల నుంచి విశేష స్పందనను పొందింది. ఈ కార్యక్రమంలో ప్రసూతి, స్త్రీరోగ, హృద్రోగ, శిశురోగ నిపుణులు పాల్గొని, ప్రస్తుతం గర్భధారణలో ఎదురవుతున్న హై–రిస్క్ కేసులు, తాజా క్లినికల్ అప్‌డేట్స్‌పై లోతైన చర్చలు జరిపారు. రీనల్ వెయిన్ థ్రాంబోసిస్, సెకండరీ, పెరిపార్టమ్ కార్డియోమ్యోపతి వంటి కీలక అంశాలపై –బేస్డ్ సెషన్లు వైద్యులకు మరింత స్పష్టత నిచ్చాయి.
ప్రత్యేకంగా, గర్భధారణలో గుండె సమస్యలు-2025 అప్‌డేట్స్ పై కార్డియాలజీ నిపుణులు అందించిన సూచనలు కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అదనంగా, నియోనేటల్ రిససిటేషన్ పై తాజా మార్గదర్శకాలు పాల్గొన్న వైద్యులకు శిక్షణాత్మకంగా ఉపయోగపడ్డాయి. ఈ కార్యక్రమం వరంగల్ లో మొదటిసారి నిర్వహించడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తూ, సిఎంఈ ప్రాంతీయ ఆరోగ్య సేవల ప్రమాణాలను మరింత మెరుగుపరచడంలో దోహదపడుతుందని తెలిపారు.