26-11-2025 10:21:30 PM
పెద్దమందడి: పెద్ద మందడి మండల పరిధిలోని ఉద్యాన కళాశాల నందు జాతీయ సేవా పథకం తరపున యన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె. భాస్కర్, నవ్యశ్వేత ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని ప్రతి విద్యార్థి ఉద్యాన విద్యతో పాటుగా తప్పకుండా రాజ్యాంగాన్ని చదవాలి అని భాస్కర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, విలువల గురించి ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇంచార్జ్ అసోసియేట్ డీన్ డా. షహనాజ్ చేతుల మీదుగా అందించారు. మన దినసరి జీవితంలో మన రాజ్యాంగం మనకు ఎంతో తోడ్పడుతుంది, ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం రాజ్యాంగం గురించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు డా.మాధవి, అశ్విని, దీపిక, నాన్ టీచింగ్ స్టాఫ్ అబ్రహాం, జయమ్మ, రేణుక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.