calender_icon.png 26 November, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలను ప్రశాంతంగా నిర్మించేందుకు సహకరించాలి

26-11-2025 10:13:00 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల నాయకులతో ఆమె సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యతగా కలెక్టర్ పేర్కొన్నారు. రేపటి (27.11.2025) నుంచి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో 18 మండలాల్లో జరగనున్నాయని తెలిపారు.

ఎంసీసీ అమలు కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనుమతుల మంజూరు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంసిసి ఉల్లంఘనపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు, మద్యం పంపిణీ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా వ్యవస్థ బలోపేతం, గ్రామ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు.

నామినేషన్ల నుంచి లెక్కింపువరకు ప్రతి దశలో పారదర్శక విధానాలు అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు చేపట్టాలని పార్టీ నాయకులూ సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విలువను కాపాడే బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పరిపాలన, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేస్తే పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బైం సా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, డి పి ఓ శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు సిరికొండ రమేష్, గండ్రత్ రమేష్, ఎంఐఎం  మజర్, గాజుల రవి, పోశెట్టి, హైదర్, ఎన్నికల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.