calender_icon.png 26 November, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వాముల సైకిల్ యాత్ర

26-11-2025 10:42:47 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన అయ్యప్ప గురు స్వామి భీంరెడ్డి, మీసానిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ స్వామి శబరిమలకి సైకిల్ పై యాత్రగా బయలుదేరి వెళ్లారు. గ్రామంలోని గ్రామంలోని మంజీరా నది ఒడ్డున వెయ్యి సంవత్సరాల క్రితం తీరాన వెలసిన మహిమాన్విత శివాలయం అయిన త్రిలింగరామేశ్వర దేవాలయం వద్ద ప్రత్యేక అభిషేకాలు చేసి సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ, అయ్యప్ప దీక్ష స్వాములు, గ్రామపెద్దలు వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు, మాజీ ఎంపీపీ దివిటి రాజదాస్, తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, అలయ కమిటీ సభ్యులు సంగమేశ్వర్ రెడ్డి, గంగాధర్, యువ నాయకుడు వంశీ గౌడ్ స్వామి, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలకు స్వాములు పాల్గొన్నారు.