calender_icon.png 26 November, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవరకొండలో సేవలందించి పదోన్నతి పొందిన పి. మౌనిక ఐపీఎస్ కు విలేకరుల అభినందనలు

26-11-2025 10:32:12 PM

దేవరకొండ: దేవరకొండ ఏఎస్పీగా శ్రద్ధా, క్రమశిక్షణతో ప్రజా భద్రత సేవలు అందించి, పదోన్నతితో అదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్న శ్రీమతి పి. మౌనిక ఐపీఎస్ కి కొండమల్లేపల్లి మండల పత్రిక విలేకరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని విలేకరులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి పలకరించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ప్రజా సేవలు అందించాలని ఆకాంక్షించారు. దేవరకొండ ప్రాంతంలో ఆమె నిర్వహించిన కృషి, ప్రజలకు చేరువైన విధానాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.