26-11-2025 10:36:28 PM
ఎస్పీ నరసింహ..
సూర్యాపేట (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినందున జిల్లాల్లో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు, నియమనిబంధనల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లా ప్రజలు, పౌరులు రాజకీయ పార్టీలు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామనీ, రహదారుల వెంట హోటల్స్ డాబాల్లో మద్యం అమ్మవద్దన్నారు. ఎన్నికల నియమాలని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.