17 April, 2026 | 5:36 AM

సూర్య 46తో అటువైపు తొలి అడుగు!

12-06-2025 12:00 AM

వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన తమిళ అగ్ర కథానాయకుడు సూర్య తన తదుపరి చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. సూర్య 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. మమిత బైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినీ పరిశ్రమకు తిరిగి వస్తున్నారు.

రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రం షూటింగ్‌ను మేకర్స్ బుధవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ‘వేడుక, భావోద్వేగం, వినోదం వైపు తొలి అడుగు’ అంటూ సూర్య ముందుకు అడుగువేస్తున్న ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా మారింది.  ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఛాయాగ్రహణం: నిమిష్ రవి; కూర్పు: నవీన్ నూలి; కళ: బంగ్లాన్.