09-01-2026 12:00:00 AM
విద్యాట్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఏఐవైఎఫ్
ఉప్పల్ జనవరి 8 (విజయక్రాంతి) : హబ్సిగూడా ప్రధాన రహదారిలోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్ భవంతిలో ఇంటర్ బోర్డ్ అనుమతులు లేకుండా అక్రమంగా మొద టి, రెండవ ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న విద్యా పీట్(ఫిసిక్స్ వాలా) అనధికార కళాశాలపై చర్యలు తీసుకోవాలని, కళాశాల అను మతులు ఒక దగ్గర,అడ్మిషన్లు ఒక దగ్గర.... తరగతులు ఒక చోట నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు.
కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం హబ్సిగూడాలోని అనధికార విద్యా పీట్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిబాబు, సతీష్, ప్రవీణ్, శేఖర్ పాల్గొన్నారు.