07-01-2026 01:16:39 AM
సైనిక్పురి విద్యుత్ ట్రాన్స్‌మిషన్ డీఈ అన్వర్ పాష
కుషాయిగూడ, జనవరి 6 (విజయక్రాంతి): సైనిక్పురి డివిజనల్ పరిధిలోని కాలనీలలో ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపడతామని సైనిక్పురి విద్యుత్ ట్రాన్స్మిషన్ డి ఈ అన్వర్ పాష పేర్కొన్నారు. కుషాయిగూడ, చర్లపల్లి ఎన్ ఎన్ కాలనీ సబ్‌స్టేషన్ల పరిధిలోని కాలనీలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి డిఇ అన్వర్ పాషకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి ఏడీఈ రాందాస్, కుషా యిగూడ సెక్షన్ ఏఈ బాలరాజ్, శివ సాయి నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు బర్ల రామచంద్రారెడ్డి, కొండగళ్ల అశోక్, షాబాద్ దామోదర్ రెడ్డి, సత్యనారాయణ, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.