23 May, 2026 | 4:32 PM

రాజీవ్‌తోనే ఐటీకి పునాది

21-08-2024 06:40 AM
  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  2. స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చారు 
  3. పీసీసీ మాజీ ప్రెసిడెంట్ వీహెచ్ 
  4. గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ జయంతి 
  5. నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాది వేసింది రాజీవ్‌గాంధీయేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతిని గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాసు మున్షీ, పీసీసీ మాజీ అధ్యక్షడు వి. హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్, అజారుద్దీన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అంజన్‌కుమార్ యాద వ్, పిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, రోహిణ్‌రెడ్డి తదితరులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి  నివాళులు అర్పించారు.

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ  ఐటీ మంత్రిగా పనిచేశానని చెప్పుకునే వ్యక్తికి ఐటీ విస్తరణకు కృషి చేసింది ఎవరో తెలియదా అంటూ నిలదీశారు. మీరు ఆక్రమించిన భూములు, చెరు వులు, కుంటలను హైడ్రా ద్వారా విముక్తి చేసి ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు. ధరణిని బంగాళాఖాతంలో  వేస్తామని,  ధరణి అంటే ధనవంతుల కోసం అనేలా గత పాలకులు తయారు చేశారని ఫైర్ అయ్యారు. పదేళ్లలో గత ప్రభుత్వం లక్ష రుణమాఫీ చేసిందని, కానీ తమ ప్రభుత్వ 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.

అమెరికా, కొరియా దేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంతి శ్రీధర్‌బాబు పర్యటించి రాష్ట్రానికి రూ. 36 వేల కొట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని తెలిపా రు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకిచ్చిన భూములను వారికే తిరిగి ఇస్తామన్నారు. వి. హనుమంతరావు  మాట్లాడుతూ18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందన్నారు. పంచాయతీరాజ్ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చారని తెలిపారు.