11 April, 2026 | 10:20 PM

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి

28-06-2024 04:21 PM

మంథని, (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మంథనిమున్సిపల్ చైర్మన్ పెండ్రి రమా సురేష్ రెడ్డిఅన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదేశాలతో  చైర్మన్ తమ పాలకవర్గం, కమిషనర్  మల్లికార్జున స్వామి,  మున్సిపల్ సిబ్బందితో కలిసి శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ , కూరగాయల మార్కెట్ తదితర కాలనీలను నేరుగా పరిశీలించి జన సంచార ప్రాంతాలు, పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. పూల కుండీలు, డ్రమ్ములు, టైర్లు వంటి వాటిలో నిల్వ ఉండే నీటిని కనీసం వారానికి ఒక రోజు తొలగించి శుభ్రం చేసుకోవాలని కోరారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మనం వినియోగించినటువంటి వస్తువులలో వర్షపు నీరు చేరి ఆ నీటిలో సూక్ష్మ క్రిములు తయారయ్యే అవకాశం వుందని,  వాటి మూలంగా మలేరియా డెంగ్యూ, ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున నిల్వ ఉన్న అపరిశుభ్ర నీటిని తొలగించి రోగాల భారీనా పడకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చైర్ పర్సన్ సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వంతో ప్రజలు మమేకమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్లు గుండ విజయలక్ష్మి పాపారావు, వేముల లక్ష్మి సమ్మయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.