పాలనా పరీక్షకు నిలిస్తేనే భవిష్యత్తు
తమిళ సినీ ప్రపంచంలో అపార ప్రజాదరణను సంపాదించిన విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) కేవలం మరో కొత్త రాజకీయ పార్టీ కాదు; 2024లో పార్టీ స్థాపన, 2024 విక్రవాండి మహాసభలో సిద్ధాంతాత్మక స్పష్టీకరణ, 2026 ఎన్నికల్లో సంచలనాత్మక ఫలితాలు, అనంతరం ప్రభుత్వ ఏర్పాటుతో టీవీకే ఒక భావోద్వేగ తరంగం మాత్రమే కాదని, ప్రజా అసంతృప్తిని వ్యవస్థీకృత రాజకీయ శక్తిగా మలచగల సామర్థ్యం ఉన్న ఉద్యమమని నిరూపించింది.
విజయ్ రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న అసలు భావనను ఆయన పలుమార్లు తమి ళ ప్రజలకు ఉన్న రుణాన్ని తీర్చడంగా పేర్కొన్నారు. సినిమా ద్వారా ప్రజల ప్రేమ, ఖ్యాతి, సంపద పొందిన వ్యక్తిగా, అదే ప్రజలకు ప్రత్యక్ష సేవ చేయడానికి రాజకీ యమే సరైన వేదిక అని ఆయన భావిం చారు. రాజకీయాలు వృత్తి కాదు, పవిత్ర ప్రజాసేవ అనే విజయ్ చేసే వ్యాఖ్యలు ఆయన మనసులోని మర్మాన్ని తెలియజే స్తున్నాయి. అవినీతి, వంశపారంపర్య ఆధిప త్యం, కుల-మత విభజనలతో అలసిపోయిన ప్రజలకు విశ్వసనీయమైన, పారదర్శకమైన, యువత ఆధారిత ప్రత్యామ్నాయం అందిం చాలన్న సంకల్పమే టీవీకే జననానికి మూల కారణం.
తమిళనాడు రాజకీయ చరిత్రను పరిశీలి స్తే సినిమా, రాజకీయాల మధ్య ఉన్న బల మైన అనుబంధం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎంజీ రామచంద్రన్ ప్రజల భావోద్వేగాలను సంక్షేమ రాజకీయాలుగా మలిచారు. జయలలిత వ్యక్తిత్వ కేంద్రీకృత నాయక త్వాన్ని సంస్థాగత శక్తిగా మార్చారు. విజయ కాంత్ ఒక దశలో బలమైన ప్రత్యామ్నా యంగా ఎదిగినా, సంస్థాగత స్థిరత్వం లేక ప్రభావం కోల్పోయారు. కమల్ హాసన్ మేధోపరమైన రాజకీయ దృక్పథాన్ని అం దించినప్పటికీ గ్రామస్థాయి క్యాడర్ నిర్మా ణంలో వెనుకబడ్డారు. ఈ చరిత్ర విజయ్‌కు ఒక స్పష్టమైన పాఠం చెబుతుంది: స్టార్ ఇ మేజ్ ప్రజలను ఆకర్షిస్తుంది; కానీ క్రమశి క్షణగల సంస్థ, స్పష్టమైన సిద్ధాంతం, ఓర్పు మాత్రమే రాజకీయ స్థిరత్వాన్ని ఇస్తాయి.
టీవీకే విజయానికి పునాది ఒక్కసారిగా ఏర్పడలేదు. విజయ్ అభిమాన సంఘాల నెట్‌వర్క్‌ను ఆయన సంవత్సరాలుగా సా మాజిక సేవా కార్యక్రమాల ద్వారా బలోపే తం చేశారు. విద్యార్థులకు బహుమతులు, సే వా కార్యక్రమాలు, విపత్తు సమయంలో సహాయ చర్యలు, యువతతో నిరంతర అనుసంధానం, ఇవన్నీ నిశ్శబ్దంగా బలమైన పొలిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించాయి. సాధారణంగా ఇతర పార్టీలు ఎన్నికల సమ యంలో మాత్రమే ప్రజలతో మమేకమ వుతుంటే, విజయ్ తన అభిమానులను భక్తులుగా కాక భవిష్యత్ కార్యకర్తలుగా మలి చారు. ఇదే టీవీకే అంతర్గత బలం.
2026 ఎన్నికల్లో టీవీకే ప్రదర్శన తమిళనాడు రాజకీయాల్లో అప్రతిహత మా ర్పునకు సంకేతమైంది. పార్టీ ప్రధాన శక్తిగా అవతరించి, సంపూర్ణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచినా, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇది ప్రజలు కేవలం కొత్త పార్టీని పరీక్షించలేదని, నిజమైన అధికార ప్రత్యామ్నాయంగా గుర్తిం చారని సూచిస్తుంది. ఎన్నో దశాబ్దాల తర్వా త డీఎంకే, అన్నాడీఎంకే ద్వైపాక్షిక ఆధిప త్యానికి గండిపడటం చారిత్రక పరిణామం.
ఈ విజయం వెనుక అత్యంత కీలక కారణం మార్పు కావాలనే ప్రజల కోరిక. ప్రజలు ముఖ్యంగా యువత, చదువుకున్న మధ్యతరగతి, మొదటిసారి ఓటువేసిన తరాలు, రాజకీయాలపై నిరాశ చెందిన వర్గా లు కొత్త నాయకత్వాన్ని కోరుకున్నాయి. ఉ ద్యోగాలు, నాణ్యమైన విద్య, అవినీతి నిర్మూ లన, డ్రగ్ నియంత్రణ, మహిళల భద్రత, పారదర్శక పాలన వంటి అంశాలను టీవీకే ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించడం ప్ర జల ఆకాంక్షలకు అనుగుణంగా మారింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారం, సినీ చ రిష్మా, బలమైన భాషా-సాంస్కృతిక అను సంధానం కలిసి టీవీకే తరంగాన్ని నిర్మిం చాయి.
విజయ్ రాజకీయ సిద్ధాంతం కూడా గమనించదగ్గది. ఆయన సామాజిక న్యా యం, లౌకికత, సమానత్వం, ప్రజాస్వా మ్యం, రెండు- భాషల విధానం వంటి అంశా లను ప్రధాన సిద్ధాంతాలుగా ప్రకటించారు. బీఆర్ అంబేద్కర్, పెరియార్ ఈవీ రామ స్వామి, కే కామరాజ్ వంటి చారిత్రక నాయ కుల ఆలోచనలను సమన్వయం చేస్తూ, సంప్రదాయ ద్రవిడ రాజకీయాలకు అను సంధానమై, అదే సమయంలో అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తన స్థానాన్ని స్పష్టం చేశారు.
అయితే టీవీకే ఎదుగుదలకు సవాళ్లు కూ డా ఉన్నాయి. అభిమానుల భావోద్వేగం శాశ్వత రాజకీయ మూలధనం కాదు. ప్రభు త్వ నిర్వహణలో ఫలితాలు ఇవ్వడం, అనుభ వజ్ఞులైన బృందాన్ని తయారు చేయడం, అంతర్గత విభేదాలను నియంత్రించడం, అధిక ఆశలను సమర్థంగా నిర్వహించడం, ప్రజలతో నిరంతర సంబంధం కొన సాగించడం అత్యవసరం. హీరో నుంచి పా లకుడిగా మారడం తమిళ రాజకీయాల్లో గొప్ప అవకాశమూ, పెద్ద పరీక్ష కూడా.
ప్రపంచ రాజకీయాల్లో కూడా ఇలాంటి ఉదాహరలు ఉన్నాయి. వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కూడా వినోద రంగం నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగి ప్రజల మార్పు ఆకాంక్షను ప్రతిబిం బించారు. ఎమాన్యూయేల్ మెక్రాన్ సంప్ర దాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిని నిర్మించారు. భారతదేశంలో అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని పాలనా శక్తిగా మలిచారు. ఈ ఉదాహరణలు ఒక సాధారణ సూత్రాన్ని తెలియజేస్తాయి: ప్రజలు మార్పును కోరుకు న్నప్పుడు, విశ్వసనీయ నాయకత్వం, సమ ర్థమైన సంస్థాగత నిర్మాణం ఉంటే రాజ కీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపో తాయి.
ప్రజల మనోభావాలను పరిశీలిస్తే, విజ య్‌పై అత్యంత భారీగా అంచనాలు ఉన్నా యి. ప్రజలు కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, నిష్పాక్షిక పాలన, అవినీతి రహిత వ్యవస్థ, యువతకు అవకా శాలు, వేగవంతమైన పరిపాలన, సాంఘిక గౌరవాన్ని కోరుకుంటున్నారు. సినిమాలో చూపిన న్యాయం పాలనలో కూడా కనిపిం చాలనే భావన ఆయన అభిమానుల్లో బలం గా ఉంది. అదే సమయంలో విమర్శకులు కూడా ఆయనను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది అవకాశంతో పాటు బాధ్యతను కూడా పెంచుతోంది.
భవిష్యత్తులో టీవీకే ప్రస్థానం నిలకడగా కొనసాగాలంటే విజయ్ అనుసరించాల్సిన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయి. మొదట, వ్యక్తిపూజ కంటే సంస్థకు ప్రాధాన్యం ఇవ్వా లి. రెండవది, యువతతో పాటు రైతులు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు వంటి విభిన్న వర్గాలతో శాశ్వత అనుసం ధానం నిర్మించాలి. మూడవది, ఎన్నికల హామీల అమలులో వేగం చూపాలి. నాలు గవది, అవినీతి ఆరోపణల పట్ల శూన్య సహ న విధానం పాటించాలి. ఐదవది, తన వ్యక్తిగత ప్రజాదరణను శాశ్వత రాజకీయ సంస్థగా మలచాలి.
టీవీకే విజయం వెనుక జరిగిన అసలు వ్యూహాత్మక ప్రజాస్వామ్య పరిణామం ఏమి టంటే దీర్ఘకాలంగా స్థిరంగా కనిపించిన రాజకీయ వ్యవస్థ ఒక్కసారిగా మారిపో యింది. సంప్రదాయ పార్టీలు తమ వ్యూహా లను పునర్విమర్శించాల్సి వచ్చింది. యువత రాజకీయాలపై కొత్తగా ఆసక్తి కనబరిచింది. మార్పు సాధ్యమే అనే భావన సామాజి కంగా బలపడింది. ఇదే టీవీకే గొప్ప విజ యంగా చెప్పాలి.
సారాంశంగా చెప్పాలంటే, తమిళగ వెట్రి కళగం ఆవిర్భావం ఒక వ్యక్తి రాజకీయ ప్రవే శం మాత్రమే కాదు; ప్రజల ఆశలు, నిరా శలు, కోరికలు, కొత్త నాయకత్వంపై నమ్మ కం, అన్ని కలిపితే ఒక చారిత్రాత్మక పరిణా మం అని చెప్పవచ్చు. తన సినీ ప్రజాదర ణను రాజకీయ నమ్మకంగా, అభిమానుల ను క్యాడర్‌గా, ఆశలను పాలనా అవకాశంగా మార్చగలిగారు. ఇప్పుడు అసలు పరీక్ష ప్రా రంభమైంది. ఆయన ఈ విశ్వాసాన్ని ఫలితా లుగా మార్చగలిగితే టీవీకే తాత్కాలిక సం చలనంగా కాకుండా; తమిళనాడు రాజకీ యాలను పునర్నిర్వచించిన చారిత్రక శక్తిగా నిలుస్తుంది.
వ్యాసకర్త: తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ
రమేష్ పాక






