15 March, 2026 | 4:10 AM

ఆయిల్ పామ్ సాగుతోనే రైతుల భవిష్యత్తు

15-03-2026 01:02 AM

౨౨న ఆయిల్ పామ్ ప్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నర్మెట్ట ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రులు తుమ్మల, పొన్నం 

నంగునూరు, మార్చి 14(విజయక్రాంతి): రైతాంగాన్ని ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లిం చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రూ. 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి తుమ్మల క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగుతుందని, అదే రోజు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి కూడా శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పండదు అనే అపోహను మంత్రి తుమ్మల తొలగించారని, రైతులు లాభదాయకమైన హార్టికల్చర్ పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరిగే రైతు మేళాను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు.