15 March, 2026 | 5:06 AM

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

15-03-2026 01:05 AM

బావిలో పూడిక తీస్తూ ముగ్గురు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం జరిగిన వేరువేరు ప్రమాదాల్లో పదో తరగతి విద్యార్థి సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైర్ తెగి, బావిలో పడ్డ ఘటనలో కొరికిశాల గ్రామానికి చెందిన సుకినే దేవారావు (48), పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య (53), కొరికిశాల గ్రామానికి పదవ తరగతి విద్యార్థి బండారి అభిలాష్ (15) దుర్మరణం పాలయ్యారు.

అభిలాష్ శనివారం ఉదయం 10వ తరగతి పరీక్ష రాసి వచ్చాడు. పాఠశాల పక్కనే బావి పూడిక తీస్తుండటాన్ని చూసి అక్కడికి వెళ్లగా.. క్రేన్ నడిపే వ్యక్తి సహాయం చేయాలంటూ కోరడంతో క్రేన్ డబ్బాలో కూర్చున్నాడు. అతే సమయంలో వైరు తెగి బావిలో పడి దుర్మరణం చెందాడు. 

మామునూరు వద్ద రోడ్డు ప్రమాదం

వరంగల్ జాతీయ రహదారిపై వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొని రంగసాయిపేటకు చెందిన శ్రీపతి వంశీ (26), కాశిబుగ్గకు చెందిన రాజు (30) మృతిచెందారు.