18 July, 2026 | 7:26 AM

తెరుచుకున్న జగన్నాథుడి గేట్లు

14-06-2024 12:05 AM

భువనేశ్వర్, జూన్ 13: ఒడిశాలోని పూరీ పట్టణంలో ఒడ్డున ఉన్న ప్రఖాత జగన్నాథ దేవాలయంలో మొత్తం నాలుగు గేట్లను గురువారం అధికారులు తెరిచారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభించిన సమయంలో 2020లో ఇందులోని మూడు గేట్లను మూసివేశారు. ఆ తర్వాత ఈ గేట్లను తెరువాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా గత బీజేడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారం లోకి వస్తే వెంటనే ఆలయంలోని నాలుగు గేట్లు తెరుస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిం ది. ఆ హామీని గురువారం నెరవే ర్చింది. గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి మోహన్‌చరణ్ మాఝీ స్వయంగా వచ్చి గేట్లు తెరిపించారు.