09-11-2025 12:00:00 AM
ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా కళారూపమైన జడకొప్పులాట మళ్లీ ప్రాణం పోసుకుంటుండడం సంతోషకరమైన పరిణామం. ఈ కళ కేవలం వినోదానికి మాత్రమే కాదు, గ్రామీణ జీవన విధానానికి అద్దం పట్టే సాం స్కృతిక సంపద. పాత కాలంలో ఈ కళారూపం ద్వారా ప్రజలకు విద్య, సామాజిక సందేశాలు, నైతిక బోధనలు అందించేవారు. ముఖ్యంగా కార్తీక మాసం పురస్కరించుకొని పలు గ్రామాల్లో జడకొప్పు కోలాటం ప్రదర్శనలతో కళాకారులు కనువిందు చేశారు.
ఒక చేతితో కోల పట్టుకొని, మరో చేతితో చీర అంచును పట్టుకొని జానపద పాటలకు అనుగుణంగా లయబద్ధంగా కోలలు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ జడ అల్లడం ఇందులోని ప్రత్యేకత. తబలా, డోలక్ వంటి వాయిస్తూ పాటలు పాడుతూ సాగిన ప్ర దర్శన మెప్పించింది. కానీ నేటి ఆధునిక యువతలో మొబైల్ ఫోన్లు, సినిమాలు, సోషల్ మీడియా వంటి ఆధునిక వినోదాల ప్రభావం పెరి గిపోయింది. దీని ఫలితంగా జడకొప్పులాట వంటి సంప్రదాయ కళలు క్రమంగా మరుగున పడుతున్నాయి. పాత కళాకారులు చెబుతున్నట్లుగా , కొత్త తరం ఈ కళల పట్ల ఆసక్తి చూపించకపోవడం బాధాకరం.
శ్రీనివాస్, మంచిర్యాల