31 August, 2026 | 6:04 AM

ఇండ్లు కూల్చకుండా నాలా ప్రహరీ నిర్మాణానికి చర్యలు

31-08-2026 01:41 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రా ంతి): భోలక్ పూర్ లోని దామోదర సంజీవ య్య నగర్ హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంత ప్రజల ఇండ్లు కూల్చకుండా ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానికులకు సూచించారు. ఆదివారం దామోదర సంజీవయ్య నగర్ వాసులకు జీహెచ్‌ఎంసీ అ ధికారులు నాలా ప్రహరి నిర్మాణానికి కొంత భాగం ఇండ్లు కూల్చి నిర్మిస్తామని నోటీసు లు ఇవ్వడంతో స్థానికులు ఆందోళన చెంది ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు ఫిర్యాదు చేశా రు.

ఎమ్మెల్యే దామోదర సంజీవయ్యనగర్ చేరుకోని నోటీసులు అందుకున్న బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అన ంతరం ఆయన మాట్లాడుతూ గత 50ఏళ్లు గా దామోదర సంజీవయ్యనగర్ లో నివా సం ఉంటున్న పేదల ఇండ్లను కూల్చవద్దని అధికారులను కోరారు. హుస్సేన్  సాగర్ నా లా చాలా వెడల్పుగా ఉందని నాలాను కొం త కుదించి ప్రహరిని నిర్మించాలని పేర్కొన్నా రు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ జీహెచ్‌ఎంసీ కమీషనర్లను కలిసి విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇతరులు వచ్చి మీలో భ యాన్ని నింపే విధంగా మాట్లాడుతారని వా రి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వపరమైతే ఈ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గత 15 రోజుల క్రితం స్థానిక నివాసి మల్లయ్య ఇంట్లో అగుగు భాగం పూర్తిగా మ ట్టికొట్టుకపోయి పెద్ద గుంత పడిందని పేర్కొన్నారు. అధికారులు ముందు జాగ్రత్త చ ర్యగా నాలా పరివాహక ప్రాంత ప్రజలకు నోటీసులు జారీ చేశారని, ఈ విషయంపై ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

స్థానికులంతా నాలాకు ప్రహరి నిర్మాణంపై ఏకతా టికి వచ్చి సరైన నిర్ణయం తీసుకోని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, భోలక్  పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, ఉపా ధ్యక్షులు ఎ.  శంకర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్, డి విజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, దా మోదర సంజీవయ్యనగర్ వాసులు దినేష్, రేణుక, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.