సత్తా చాటుతున్న మాస్టర్ అథ్లెటిక్స్..
వారి కృషి యువతకు ఆదర్శం..
సికింద్రాబాద్, ఆగస్టు30 (విజయక్రాంతి): వయస్సు పెరిగిన క్రీడల్లో చురుకుగా పాల్గొంటున్న మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు, యువతకు సీనియర్ సిటిజన్ల స్ఫూర్తిగా నిలుస్తున్నారు.సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఆఫ్ సీజన్ మీట్2026 ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్,బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, చీఫ్ ఫ్యాట్రాన్ జంపన ప్రతాప్ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ పోటీల్లో 35 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు క్రీడల పట్ల ఆసక్తిని కొనసాగించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా,ఆరోగ్యంగా ఉండవచ్చని ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని, క్రీడా స్ఫూర్తితో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ మెడల్స్ సాధించడం అభినందనీయం.అనంతరం రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నేషనల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ముఖ్య అతిధులు ఎమ్మెల్యే గణేష్,బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, డిస్ట్రిక్ట్ స్పోరట్స్ ఆఫీసర్ గోకుల్, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, చీఫ్ ఫ్యాట్రాన్ శ్రీనివాస్ రెడ్డి,కోశాధికారి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గౌడ్. వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.






