20-12-2025 12:25:48 AM
నూతన కాంగ్రెస్ సర్పంచ్‌ల సన్మానం
తంగళ్ళపల్లి, డిసెంబర్ 19(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నూతన సర్పంచులుగా ఘన విజయం సాధించిన సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన క్యాంప్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించా సీసీరు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగం ప్రవీణ్ తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం, మండపల్లి సర్పంచ్ గాదగోని సాగర్, సారంపల్లి సర్పంచ్ గుగ్గిల లావణ్య, ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచన, తాడూరు సర్పంచ్ సదానందం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భైరవేణి రాము, లింగాల భూపతి, సత్తు శ్రీనివాస్ రెడ్డి, చోటు, భరత్ తదితరులు హాజరయ్యారు.తంగళ్ళపల్లి మండలంలో మొత్తం ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందడం పార్టీకి గొప్ప బలం చేకూర్చిందని నేతలు పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని నూతన సర్పంచులు తెలిపారు.