calender_icon.png 20 December, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైన్ షాపులో చోరీ

20-12-2025 12:26:02 AM

గోడకు కన్నం వేసి నగదు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి

కుత్బుల్లాపూర్, డిసెంబర్ 19(విజయక్రాంతి): సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయం నగర్ ఆర్యన్ వైన్స్‌లో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. వైన్స్ షాప్ గోడకు కన్నం పెట్టి లక్ష రూపాయల నగదు, 15 మద్యం బాటిల్లు ఎత్తుకెళ్లారు. వైన్స్ షాప్ యజమాని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.