12 March, 2026 | 6:07 PM

Breaking News

పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •   ఇది ఆరంభం మాత్రమే.. గ్యాస్ కొరతతో దేశం అల్లాడిపోతుంది   •  

జమిలి ఎన్నికలే లక్ష్యం

18-03-2025 04:22 PM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతుందని జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంతో కలిసి 16 మండలాల వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో జిల్లాస్థాయి కార్య శాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... లోక్ సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.

పరిపాలన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా బిజెపి పార్టీ 1984 నుండి ప్రోచేస్తుందని తెలిపారు. పార్లమెంటులో మెజార్టీ లేకపోవడంతో గతంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ముందుకు వెళ్లలేదని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు నిర్వహణ కోసం క్యాబినెట్లో ఆమోదం తెలపడంతో పాటు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. క్షేత్రస్థాయిలో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చర్ల మురళి, సీనియర్ నాయకులు బోనగిరి సతీష్ బాబు ,రాజేందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.