calender_icon.png 10 May, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

18-03-2025 04:25:13 PM

కాటారం (విజయక్రాంతి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంగళవారం కాటారం మండలం దామరకుంటలో ఓ ఇల్లు దగ్ధమైంది. దుర్గం గట్టు మల్లు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వ్యవసాయ కూలీ పనులు నిమిత్తం బయటకు వెళ్లగా మంగళవారం మధ్యాహ్నం ఫ్రిడ్జ్ లో మంటలు చెలరేగినట్లు బాధితులు వాపోయారు. ఇంటికి నిప్పు అంటుకొని పూర్తిగా దహనమైనట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న బీరువా సామాన్లు, వస్తువులు, తినుబండరాలు, దుస్తులు, నిత్యవసర వస్తువులు పూర్తిగా దహనమయ్యాయి. గ్రామస్తులు గమనించి నీటితో మంటలను ఆర్పేవేశారు. పూర్తిగా దగ్ధం కావడంతో గట్టుమల్లు కుటుంబం కట్టుబట్టలతో బయటనే ఉన్నారు. ఐదు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.