కల్లుగీత కార్మికుల సంక్షేమమే లక్ష్యం
కల్లు గీత కార్మిక సంఘం సొసైటీ చైర్మన్ గా చనగాని పురుషోత్తం గౌడ్..
గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చనగాని పురుషోత్తం గౌడ్‌ను సొసైటీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం నూతన చైర్మన్ చనగాని పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ, కల్లుగీత కార్మికులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే వారి జీవన స్థాయి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అన్నారు. మా సొసైటీ ద్వారా కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, బీమా ప్రయోజనాలు, భద్రతా పరికరాలు, తాటి ఈత చెట్లు సంరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తాం. అలాగే ఈ వృత్తికి గౌరవం పెరిగే విధంగా పనిచేస్తాం అని తెలిపారు.
వైస్ చైర్మన్‌గా మండవ నాగేశ్వరరావు గౌడ్,ప్రధాన కార్యదర్శిగా నర్సింగ్ వెంకటేశ్వర్ల గౌడ్ ఎన్నుకోబడ్డారు. సొసైటీ డైరెక్టర్లుగా గుండు రమేష్ గౌడ్, గుండు వీరబాబు గౌడ్, తెల్లబాటి ఎర్రయ్య గౌడ్, పెండం వీరస్వామి గౌడ్, దొంతగాని అంజయ్య గౌడ్, నర్సింగ్ వీరాంజి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కల్లుగీత వృత్తిలో ఎదురయ్యే సమస్యలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారాలు సాధించడానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా చెట్లపై ఎక్కే సమయంలో భద్రత, గీతసామాను ధరలు, మార్కెట్ సౌకర్యాలు, గుర్తింపు కార్డుల జారీ వంటి కీలక అంశాలపై పని చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కార్యక్రమంలో గౌడ కుల పెద్దలు, తుమ్మల సైదయ్య, పోలంపల్లి ఆనందబాబు, మామిడి వెంకటేశ్వర్లు, అమర గాని బక్కయ్య, బొల్లెపల్లి శ్రీనివాస్,గుండు రాంబాబు గౌడ్, యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు, సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




