10 March, 2026 | 6:30 PM

రాజీ మార్గమే రాజమార్గం

02-11-2025 08:23 PM

బెజ్జంకి ఎస్ఐ సౌజన్య..

బెజ్జంకి: రాజీమార్గమే రాజ మార్గమని, రాజీ పడటం వల్ల ఇరువర్గాలు ఆ కేసులో గెలిచినట్లేనని సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య తెలిపారు. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతు ఇబ్బందులు పడుతున్నావారు ఈనెల 15న హుస్నాబాద్ కోర్టులో జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాక్సిడెంట్, గొడవ, చీటింగ్, భూతగాదాలు వివాహ సంబంధానికి సంబంధించిన కేసులపై రాజీ పడదగిన కేసులపై రాజీపడి కేసులను క్లోజ్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.