6 July, 2026 | 3:27 PM

Breaking News

విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ

30-06-2025 02:09 AM

ఆమనగల్లు, జూన్ 29: అమనగల్లు మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించామని ఈ ధపా 50వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ శంకర్ తెలిపారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో మొక్కల నాటే కార్యక్రమంలో భాగస్వాము లై సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గత మూడు రోజులుగా పలు వార్డుల్లో, గుర్తించిన ప్రభుత్వ స్థలాలు, రోడ్లు సమీపంలో  3,500 మొక్కలు నాటి నట్లు ఆయన చెప్పారు.

గత మూడు రోజులుగా వర్షం కూడా అనుకూలించడంతో మున్సిపాలిటీలో విస్తృతంగా హరితహారం కార్యక్రమం శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. నర్సరీలో అందుబాటులో ముక్కలు ఉన్నాయని... మున్సిపాలిటీ ప్రజలు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, యువత, విద్యార్థులు భాగస్వాములై మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మొక్కలు నాటడం ద్వారానే ప్రకృతి పరిరక్షించబడుతుంది అని సకాలంలో వానలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం అలవడేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని చెప్పారు. అప్పుడే విద్యార్థులు హరితహారంలో భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ఉంటుందని ఆయనగుర్తుచేశారు.