19-01-2026 12:00:00 AM
శేరిలింగంపల్లి, జనవరి 18 (విజయక్రాంతి): ప్లాస్టిక్ వినియోగం వల్ల పెరుగుతు న్న పర్యావరణ ముప్పును ఎదుర్కొనే బాధ్య త ప్రభుత్వాలకే పరిమితం కాదని, సమాజమంతా భాగస్వాములవ్వాల్సిన అవసరం ఉందని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రోలింగ్ హిల్స్ ప్రాంతంలో ‘జీరో ప్లాస్టిక్ 2040’ లక్ష్యంతో నిర్వహించిన శుభ్ర త కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దక్షిణ కొరియాకు చెందిన ఏఎస్‌ఈజెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం యువతలో పర్యావరణ బాధ్యతను మరింత బలపరిచిందని అభిప్రాయప డ్డారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని, దీన్ని అరికట్టాలంటే అవగాహనతో పాటు కఠినమైన వ్యక్తిగత నిర్ణయాలు అవసరమన్నారు.
మనం నివసిస్తున్న ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చా రు. అలాగే దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఏఎస్‌ఈజెడ్ సభ్యులు అనోక్, విశాల్, జాషువ, టియోతో పాటు కృపాకర్, సతీష్, ఆశిష్, అమోహ్ నగేష్ నాయక్, నిఖిల్ తదితరులు శుభ్రత కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించారు.