నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
- మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్
- ఎల్కతుర్తిలో కేజీబీవీ నూతన భవనం ప్రారంభం
భీమదేవరపల్లి, ఆగస్టు 10 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంతులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పేదల పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో రూ.3.25 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూ తన భవనాన్ని వారు ప్రారంభించారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేద కుటుంబాల పిల్లలు కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పా ఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్య ను పొందేలా ప్రభుత్వం విద్యారంగంపై భా రీగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లలు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీల ను 40 శాతం, పేదింటి ఆడపిల్లలు వసతి గృహాల్లో చదువుకునేందుకు అవసరమైన కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిన ఘ నత ప్రజా ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపా రు.
కేజీబీవీ ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి వెంటనే స్పందించారు. విద్యార్థినులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా గ్రిల్స్, ప్ర హరీ తదితర అవసరమైన పనులను టాప్ ప్రాధాన్యతతో చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్ర భాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు మౌలిక వసతులు, నూతన భవనాల నిర్మాణం, ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రా ధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పా య్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీఈఓ గిరిరాజ్ గౌడ్, ప్రిన్సిపాల్ అనితాదేవి పాల్గొన్నారు.






