26 August, 2026 | 2:01 AM

క్షేత్రస్థాయిలో పోలీసింగ్ బలోపేతమే లక్ష్యం

26-08-2026 12:30 AM

ఎస్‌పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): పోలీసింగ్ అనేది కేవలం పోలీస్ స్టేషన్కు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతర అనుసంధానంతో కొనసాగాలని, క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు.

అధికారులు, సిబ్బంది కేసుల విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు నాణ్యతను పెంచాలని సూచించారు. ఎస్పీ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నిర్వహించారు మంగళవారం సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని కిట్లను, రికార్డులను, వివిధ గదులను, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రిసెప్షన్ను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, స్టేషన్ నిర్వహణ తీరును పరిశీలించారు.

స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందితో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి విధి నిర్వహణ, ఎదురవుతున్న డ్యూటీ సంబంధిత సమస్యలు, వ్యక్తిగత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనతో స్వేచ్ఛగా పంచుకోవచ్చని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిబ్బందికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా రొటీన్ హెల్త్ చెకప్లు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీ ఐ అంజలి, ఎస్ ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.