15 August, 2026 | 2:54 AM

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం

15-08-2026 12:00 AM

వనపర్తి టౌన్ ఆగస్టు 14 : ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు.

విద్యే విద్యార్థులకు అందించగలిగే గొప్ప ఆస్తి అని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, నాయకులు, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.