ఎస్సీ హాస్టళ్ల ఆకస్మిక తనిఖీ
మేడ్చల్, ఏప్రిల్ 20(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జి. వినోద్ కుమార్ ఈసీఐఎల్ కాలేజ్ గరల్స్ హాస్టల్, కాప్రా కాలేజ్ బాయ్స్ హాస్టల్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్స్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యా వాతావరణం తదితర అంశాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. భోజన నాణ్యతను మెరుగుపరచా లని, సమయానికి ఆహారం అందించాలని, హాస్టల్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
అలాగే విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టి, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాస్టల్ రికార్డులు, హాజరు నమోదులు, స్టాక్ రిజిస్టర్లు కూడా పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.






