08-07-2025 01:30:17 AM
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-రూ 15 లక్షలతో సెంట్రల్ రైటింగ్ పనులకు శంకుస్థాపన
భద్రాచలం జూలై 7 (విజయ క్రాంతి); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.సోమవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి చర్ల రోడ్డు వరకు రూ15 లక్షల వ్యయంతో నిర్మించనున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రామాలయ మాడవీదుల విస్తరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వం అనీ, ప్రజల సంక్షేమమే ఏ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ప్రారంభించిన పనులను త్వరితగతిన నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐ టి డి ఏ పి ఓ రాహుల్ పాల్గొన్నారు.