08-07-2025 01:32:14 AM
- జిల్లాస్థాయి అధికారులు డుమ్మా
- ద్వితీయ స్థాయి అధికారులతో మమా
- ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి
- అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్
భద్రాద్రి కొత్తగూడెం జులై 7 (విజయ క్రాంతి); ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో తూ తూ మం త్రంగా సాగుతోంది. వారం వారం జిల్లా వ్యాప్తంగా దూర ప్రాంతం నుంచి సమస్యల పరిష్కారానికై ఎంతో వ్యయ ప్రయాసలతో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి తండోపతండాలు గా ప్రజలు హాజరవుతున్నారు.
దరఖాస్తులు ఇవ్వడ మే తప్ప పరిష్కరించడం లేదని వారు వాపోతున్నారు. పారదర్శకత లేమితో ప్రజావాణి తూతూ మంత్రంగా సాగుతోం ది. ప్రజావాణిలో అన్ని ప్రభుత్వ శాఖల జి ల్లా అధికారులు తప్పనిసరిగా హాజర అవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఆచరించిన దాఖ లాలు లేవు. కార్యాలయపు సూపరిండెంట్, కార్యాలయపు మేనేజర్లు ప్రజావాణిలో దర్శనమిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు ప్ర జావాణికి డుమ్మా కొడుతున్నారు.
వచ్చిన అధికారులు ఎవరి దారి వారిది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ చూసి చూడనట్లు వ్యవహరించడం అనేక ఆరోపణలకు దారితీస్తుంది. కేవలం దరఖాస్తులు తీసుకొని ప్రజావాణి మామ అనిపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
శాఖల పరంగా కలెక్టర్ రివ్యూ చేయకపోవడం, పరిష్కారం కానీ సమస్యలకు సమా ధానం ఇవ్వకపోవడం ప్రజల్లో ప్రజావాణి పై నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రజావాణి పే రుతో జిల్లాస్థాయి అధికారులు కార్యాలయంలో ఉండకుండా, ప్రజావానికి హాజరు కాకుండా సొంత యాపకాలతో కాలం కడుపుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ లక్ష్యం నీరుగారు తోందని చెప్పక తప్పదు.
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదన పు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కా ర్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్