calender_icon.png 15 July, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

15-07-2025 12:00:00 AM

మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ 

ఘట్ కేసర్, జూలై 14 : అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ సారధ్యంలోని ప్ర జా ప్రభుత్వo లక్ష్యంగా పెట్టుకుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వ జ్రేష్ యాదవ్ అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రె డ్డి ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5లక్షలు మంజూరు చేసి నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మహోత్సవం.

కా ర్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ సోమవారం ఘట్ కేసర్ మున్సిపల్ లోని పలు వార్డులలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పలువురు నాయకులతో కలిసి పలు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు అబ్బసాని యాదగిరియాదవ్, డక్కి రమేష్, వేముల మమత గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకూరి మచ్చేందర్ రెడ్డి, కీసర దేవస్థానం ధర్మకర్తలు సగ్గు అనీత, సామల అమర్, మాజీ కౌన్సిలర్లు కడపోల్ల మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కె. నాగరాజ్, యూత్ కాంగ్రెస్ బొక్క సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, కవాడి మాధవరెడ్డి మేడబోయిన జంగయ్య ముదిరాజ్, బర్ల దేవేందర్ ముదిరాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.