15-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, జూలై 14: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖెడ్ మున్సిపల్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఇందిరా మహిళ శక్తి విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చి వారిని కోటీశ్వరులను చేసేందుకు ముందుకెళుతున్నామని, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కేటాయింపులపై ప్రభుత్వం దృష్టి సాధించిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను అందించారు. అంతకుముందు నారాయణఖేడ్ పట్టణంలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద అటవీ శాఖ అధికారులతో కలిసి వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక మొక్కలు నాటారు. నారాయణఖేడ్ పట్టణంలో స్టేట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖేడ్ మండల పరిధిలోని అంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఇల్లు లేని ప్రతి పేదవాడికి గూడు కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గిరిజా షట్కార్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, సంగమేష్ పాటిల్, చెన్నుపాటి ల్ శంకర్ ముదిరాజ్, ఐకెపి ఏపీఎం వంశీకృష్ణ, ఇతర అధికారులుపాల్గొన్నారు.