23-02-2026 12:42:08 AM
గరిడేపల్లి, ఫిబ్రవరి 22 : పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల కు పెన్షన్ అందే విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి దామోదర్ రెడ్డి అన్నారు.గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో మండల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగానే పాత విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్లు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.పెన్షన్లు మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, పదవీ విరమణ పొందిన వారంటే వయసులో పెద్దవారిగా గుర్తించాలని పెన్షన్ కోసం ఈ వయసులో తిరిగే పరిస్థితి లేక కొందరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిని పాలకులు అర్థం చేసుకొని ఉద్యోగుల సంఘంతో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రిటైర్డ్ ఉద్యోగుల కోసం భవనాన్ని నిర్మించడం పట్ల మండల రిటైర్డ్ ఉద్యోగుల సంఘాన్ని ఆయన అభినందించారు.మండల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు
సుందరి నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక నిపుణులు డాక్టర్ అందే సత్యం రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు రావెల్ల సీతారామయ్య,ఎం వెంకటమ్మ, చంద్రయ్య, జిల్లా సంఘం అధ్యక్షులు బోట్ల రాంబాబు,ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, కోటయ్య, నాగేశ్వరరావు, కరీం, అప్పారావు, పుల్లయ్య, సంతోష్ మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.