calender_icon.png 17 November, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

23-07-2024 12:47:13 AM

  • ఉభయ సభల సమావేశంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 

హైదరాబాద్, జూలై 22 ( విజయక్రాంతి) : సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారం భమైన శాసనసభా సమావేశాల్లో ఆయన ఉ భయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రా ష్ర్ట విభజనతో నవ్యాంధ్రకు నష్టం వాటిల్లిందని, అలాంటి స్థితిలో అన్ని రంగాల అభి వృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగింద ని, రాజధాని నిర్మాణానికి అపూర్వ కృషి జరిగిందని, కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయని పే ర్కొన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు న ష్టం వాటిల్లిందన్న ఆయన  ఏపీ సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2019లో వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ర్టంలో అన్ని రంగా ల్లో నష్టపోయిందని, చంద్రబాబు హయా ంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని గుర్తు చేశారు. 

అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విడదీశారని, రాష్ట్ర విభజన ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ర్ట పునర్‌వ్యవస్థీకరణ వల్ల ఏపీ సుదీర్ఘ కాలం పాటు అభివృద్ధి పురోగతికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదని, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడంతో  ఆర్థిక నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.