27 April, 2026 | 1:30 AM

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

27-04-2026 12:09 AM

మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ, ఏప్రిల్ 26: ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరిలు అన్నారు. ఆదివారం కోదాడ ఆర్టిసి డిపోలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అంగీకారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ఫ్లెక్సీ లకు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టిసి నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్ లు అంగీకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.