13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

క్వారీలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

31-03-2026 01:08 AM

ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్

సత్తుపల్లి, మార్చి 30 (విజయక్రాంతి): సత్తుపల్లి మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో క్వారీలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు.  సోమవారం మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారి మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ హాత్యా అని  ఆరోపించారు.

ఊరు సమీపంలో అక్రమంగా క్వారీలకు అనుమతులు ఇచ్చి చిన్నారుల ప్రాణాలను బలి తీసుకోవడం సరైనది కాదన్నారు. ఈ క్వారీలకు అనుమతులు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రెండు కోట్ల ఎక్స్గ్రేషియాతోపాటు ఆ కుటుంబంలోని సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుంగ హరికృష్ణ. నాయకులు ఉన్నారు.