13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కేంద్రం మొండి వైఖరికి తెలంగాణ సమాధానం ఈ చట్టం

31-03-2026 01:09 AM

అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు ఆమోదంపై సత్యనారాయణ గుండ్లపల్లి హర్షం  

హైదరాబాద్, మార్చి 30(విజయక్రాం తి) : రాష్ట్ర శాసనసభలో ‘తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు- 2026’ ఆమోదం పొం దడం పట్ల న్యాయవాద లోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. సోమవారం రంగారె డ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్‌కు న్యాయవాదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది సత్యనారాయణ గుండ్లపల్లి మాట్లాడుతూ, దేశవ్యా ప్తంగా న్యాయవాదులపై దాడులు, వేధింపు లు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.కేంద్రం ఉ దాసీనతకు తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా గట్టి సమాధానం చెప్పిందని కొనియాడారు. ముఖ్యంగా ఈ బిల్లు రూపకల్ప నలో, ఆమోదం పొందడంలో పొన్నం అశో క్ గౌడ్ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీపీ సీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ సంతోష్ కుమా ర్, సీనియర్ న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.