16 May, 2026 | 2:50 AM

చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది

16-05-2026 01:12 AM

గిరిజన ప్రజలతో కలెక్టర్ మాట ముచ్చట

 అచ్చంపేట మే 15: చెంచు గిరిజన కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి టీజీఐఎల్పీ కీలకమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మల్లాపూర్ పెంట గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన చెంచు గిరిజన ప్రజలతో మాట ముచ్చట చేస్తూ 34 చెంచు కుటుంబాల సమస్యలను తెలుసుకుని, జీవనోపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పశుపోషణ, కోళ్ల పెంపకం, అటవీ ఉత్పత్తుల ఆధారిత ఉపాధి, చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం పెంచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తాగునీరు, రహదారులు, ఆరోగ్య, విద్యా సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.