24 March, 2026 | 9:41 AM

ప్రభుత్వం 420 హామీలను వెంటనే అమలు చేయాలి

24-03-2026 12:00 AM

తాడ్వాయి, మార్చి 23 (విజయ క్రాంతి): ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సోమవారం వారు మాట్లాడుతూ... బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు ఇచ్చిన పిలుపుమేరకు బిజెపి ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నందున పోలీసులు తమను అరెస్టు చేసి తాడువాయి పోలీస్ స్టేషన్ లో ఉంచారని తెలిపారు.

ప్రభుత్వం లేనిపోని మాయమాటలు చెబుతూ ముందుకు సాగుతుందని గతంలో కేసిఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అరెస్టు చేసిన వారిలో తాడ్వాయి మండల బిజెపి అధ్యక్షులు సంతోష్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కార్యదర్శి హోటల్ శ్రీను, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావులు ఉన్నారు.